రెండు నెలల్లో సర్కార్‌ పతనం తథ్యం

2 Oct, 2019 08:46 IST|Sakshi

మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప సర్కార్‌ రెండు నెలల్లో పతనం కాకతప్పదని జేడీఎస్‌ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన నగరంలో దాసరహళ్లిలో నిధుల కోతను వ్యతిరేకిస్తూ జేడీఎస్‌ నిర్వహించిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తను అభివృద్ధి కోసం మాత్రమే తల వంచుతానన్నారు. ఇదీ ఇప్పటికి నిర్వహిస్తున్న ధర్నా మాత్రమేనని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే వచ్చే రోజుల్లో విధానసౌధను కూడా ముట్టడిస్తామన్నారు. శికారిపురకు సీఎం బీఎస్‌ యడియూరప్ప రూ. 800 కోట్లను విడుదల చేశారు.

అయితే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులను విడుదల చేసినట్లు కుమార గుర్తు చేశారు. ఇది ఒక విధంగా సిగ్గులేని ప్రభుత్వామని ఎదురుదాడి చేశారు. వరదలతో రెండన్నర లక్షల మంది నిరాశ్రయులైతే వారికి సాయం అందించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు వెళ్లి ప్రసంగిస్తారు. వరద బాధితుల సమస్యలను మా త్రం పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ఎవరితో విచారణ చేసినా భయపడేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడ హెచ్‌ కే కుమారస్వామి, ఎమ్మెల్యే ఆర్‌ మంజునాథ్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా