మక్కా పేలుళ్ల కేసులో కేంద్ర వైఫల్యం

17 Apr, 2018 01:37 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ

సాక్షి, హైదరాబాద్‌: మక్కామసీదు పేలుళ్ల కేసులో కేంద్రం సాక్ష్యా లు చూపించడంలో విఫలమైనందునే కేసును కొట్టివేశారని కాంగ్రెస్‌ నేత సర్వే సత్యనారాయణ విమర్శించారు.  పేలుళ్లతో ఎవరికి సంబంధం ఉందో తెలియకుండా పోయిందని.. ఎవరూ దోషులు కాకపోతే పేలుళ్లు ఎలా జరిగాయని ప్రశ్నించారు.

అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కూకట్‌పల్లి వైజంక్షన్‌లో జరిగిన ఘటనను ఆసరాగా చేసు కుని తనపై క్రిమినల్‌ కేసు పెట్టడం వెనుక ప్రభుత్వం కుట్ర ఉందన్నారు. తాను కలెక్టర్‌ను అవమానపరిచి ఉంటే ఆయనే తనపై కేసు పెట్టాలని, సభ అర్ధాంతరంగా ఆగిపోయిందంటూ తనపై ప్రభుత్వం కేసు ఎందుకు పెడుతుందని ప్రశ్నించారు. సీఎంకు దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. 

మరిన్ని వార్తలు