నిప్పుతో చెలగాటమా అని నిలదీయండి..

27 Mar, 2018 09:34 IST|Sakshi

సాక్షి, అమరావతి : పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు మంగళవారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అవిశ్వాస తీర్మానం చర్చకొచ్చే నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. కేంద్రంపై ఎదురుదాడికి దిగాలని ఎంపీలకు సూచించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు తానని, వాళ్లకన్నా ముందుగా తాను సీఎం అయ్యానని గుర్తుచేయాలని చెప్పుకొచ్చారు. గతంలోనే జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పిన తనపై నిందలు వేస్తారా అని నిలదీయండని ఉద్భోదించారు. చిన్న మచ్చ కూడా లేని మా నేతపై మీ దాడి ఏంటని ప్రశ్నించండని కోరారు. 

ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే ఎదురు దాడి చేయడంపై కేంద్రాన్ని నిలదీయాలని, మనల్ని విమర్శించనంత వరకూ అంశాలవారీగానే ముందుకు పోదామన్నారు. బీజేపీ నేతలు వ్యక్తిగతంగా పోతే మనం కూడా వ్యక్తిగత దాడికి వెనుకాడరాదని సూచించారు. ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామని, రాజకీయాల్లో హుందాతనం అవసరమని విలువలు వల్లించారు. బీజేపీ నేతలు అప్పుడే మనకు కాంగ్రెస్‌తో పొత్తు అని ప్రచారం చేస్తున్నారని గతంలో ఎన్నడూ లేని విదంగా ఆ పార్టీలో కొత్త సంస్కృతి పుట్టుకొచ్చిందన్నారు.

మరిన్ని వార్తలు