అందుకే బాదామి బరిలో

23 Apr, 2018 09:31 IST|Sakshi

పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరారు

24న నామినేషన్‌ వేస్తా: సీఎం సిద్ధు

మైసూరు: చాముండేశ్వరితో పాటు బాగల్‌కోట జిల్లా బాదామి నుంచి కూడా పోటీ చేయడానికి కారణాన్ని సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో వెల్లడించారు. ఉత్తర కర్ణాటక ప్రజలు బాదామిలో పోటీ చేయమని నన్ను ఒత్తిడి చేశారు, దీంతో అదిష్టానం పెద్దల ఆదేశాల మేరకు బాదామిలో పోటీ చేస్తున్నానని, ఈ నెల 24వ తేదీన అక్కడ నామినేషన్‌ దాఖలు చేస్తాను అని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదివారం ఉదయం మైసూరు మండకళ్ళి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయలేదని, ఇదే మొదటిసారని తెలిపారు.

తాను బాదామి నుంచి పోటీ చేయడం ద్వారా అక్కడి ప్రజలకు మంచి జరుగుతుందని పట్టుబట్టికోరుతున్నారని, పార్టీ పెద్దలు కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బాదామిలో బీజేపీ నుంచి బళ్లారి ఎంపీ శ్రీరాములు పోటీ చేస్తారనడంపై స్పందిస్తూ, ఇతర పార్టీల నుంచి ఎవరు నిలబడినా తాను తలనొప్పి తెచ్చుకోబోనని, గెలిచేది తానేనని అన్నారు. చాముండేశ్వరిలో ఓటమి భయంతోనే బాదామికి వెళ్తున్నట్లు జేడీఎస్‌ నాయకులు విమర్శించడంపై స్పందిస్తూ, ఓటమి భయంతోనే కుమారస్వామి కూడా రెండు చోట్ల పోటీ చేస్తున్నాడా?, ప్రదానమంత్రి నరేంద్ర మోదీ కూడా పరాజయం భయంతోనే రెండు చోట్ల పొటీ చేశారా? అనిప్రశ్నించారు. కుమారస్వామి చాముండేశ్వరిలో ఎన్నిరోజులైనా ప్రచారం చేసుకోవచ్చని అన్నారు.

మరిన్ని వార్తలు