అవిశ్వాస తీర్మానం; మరో మలుపు

23 Mar, 2018 14:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హోదా కల్పన, విభజన హామీల అమలులో విఫలమైన ఎన్డీఏ సర్కారుపై కాంగ్రెస్‌ పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే శుక్రవారం ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను కలిసి నోటీసులు ఇచ్చారు. ఆయన వెంట వెంట ఎంపీ జేడీ శీలం కూడా ఉన్నారు.

కేంద్రంపై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చాలా మంది ఎంపీలు మద్దతు ఇచ్చారని, ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చకు అవకాశం కల్పించాల్సిందేనని జేడీ శీలం మీడియాతో అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేదాకా కాంగ్రెస్‌ పోరాడుతూనేఉంటుందని స్పష్టం చేశారు. ఇదే అంశంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీలు విడివిడిగా ఇచ్చిన నోటీసులు చర్చకు వచ్చినా తాము మద్దతుగా నిలబడతామని తెలిపారు.

(చదవండి: అవిశ్వాసం తీర్మానం.. ఆరో రోజూ అదే ప్రకటన!)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా