బరిలో కోటీశ్వరులు

11 Apr, 2019 05:41 IST|Sakshi

లోక్‌సభ 2019 ఎన్నికలకు తొలి దశ పోలింగ్‌ మొదలైంది. మొత్తం ఏడు దశల్లో 545 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వివిధ దశల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే అనేక మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండుచోట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు చేసిన ప్రముఖుల అఫిడవిట్లలో.. ఆస్తులు, అప్పులు, స్థిర చరాస్తులు, భూముల వివరాలు ఇలా ఉన్నాయి.

ములాయంసింగ్‌ యాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ)
     పోటీ చేస్తున్న స్థానం:    మణిపురి
     ప్రకటించిన ఆస్తులు:    రూ.20.54 కోట్లు
     2014లో ఆస్తులు:    రూ.15.95 కోట్లు
     స్థిరాస్తులు: రూ.16.21 కోట్లు (2014: రూ.12.54 కోట్లు)
     చరాస్తులు: రూ.4.33 కోట్లు (2014: రూ.3.41 కోట్లు)
     పెట్టుబడులు: రూ.50.09 లక్షలు
     బ్యాంక్‌ బ్యాలెన్స్‌: రూ.40.13 లక్షలు
     (ములాయంసింగ్‌ యాదవ్‌: రూ.11.25 లక్షలు, భార్య పేరిట: 28.88 లక్షలు)
     అప్పులు:    రూ.2.2 కోట్లు
     క్రిమినల్‌ కేసులు: లక్నోలో ఒక కేసు
     అధీనంలోని భూమి: రూ.7.89 కోట్ల విలువైన 10.77 ఎకరాలు, 5,000, 5,974 చ.అ. ప్లాట్లు, 16,010, 3,230 చ.అ. వైశాల్యం గల రెండు ఇళ్లు.

అమిత్‌ షా (బీజేపీ జాతీయ అధ్యక్షుడు)
     పోటీ చేస్తున్న స్థానం:    గాంధీనగర్‌
     ప్రకటించిన ఆస్తులు:    రూ.30.81 కోట్లు
     స్థిరాస్తులు:    రూ.15.29 కోట్లు
     చరాస్తులు:    రూ.23.51 కోట్లు
     పెట్టుబడులు:    రూ.21.95 కోట్లు
     బ్యాంక్‌ బ్యాలెన్స్‌:    రూ.37.61 లక్షలు
     అప్పులు:        రూ.47.69 లక్షలు
     క్రిమినల్‌ కేసులు: పశ్చిమ బెంగాల్, బిహార్‌లో రెండు చొప్పున మొత్తం నాలుగు
     అధీనంలోని భూమి:    22 ఎకరాల పొలం, 3,511, 59,890 చ.అ. వ్యవసాయేతర ప్లాట్లు రెండు.

సుప్రియా సూలే (నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ)
     పోటీ చేస్తున్న స్థానం:    బారామతి
     ప్రకటించిన ఆస్తులు:    రూ.140.88 కోట్లు
     2014లో ఆస్తులు: రూ.116.46 కోట్లు
     స్థిరాస్తులు: రూ.22.55 కోట్లు (2014: రూ.17.47 కోట్లు)
     చరాస్తులు: రూ.118.33  కోట్లు (2014: రూ.98.99 కోట్లు)
     పెట్టుబడులు: రూ.97.86 కోట్లు (రూ.16.74 సుప్రియా సూలే పేరిట, రూ. 81.12 కోట్లు భర్త సదానంద సూలే పేరిట)
     చేతిలో ఉన్న నగదు:    రూ. 94,320 (సుప్రియ పేరిట: రూ.28,770, భర్త సదానంద్‌: పేరిట రూ.23,050, కుమార్తె రేవతి పేరిట రూ.28,900, కొడుకు విజయ్‌ పేరిట రూ.13,600)
     అప్పులు:    రూ.55 లక్షలు
     క్రిమినల్‌ కేసులు: లేవు
     అధీనంలోని భూమి:    రూ.2.7 కోట్ల విలువైన 16.7 ఎకరాలు. రూ.1.03 కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి 1.77 ఎకరాలు. 2765, 2541 చ.అ. విస్తీర్ణంలో ఉన్న రెండు ఇళ్లు. భర్త సదానంద్‌ పేరుతో 4,442 చ.అ. ఇల్లు మరొకటి).
 
నితిన్‌ గడ్కరీ (బీజేపీ)

     పోటీ చేస్తున్న స్థానం:    నాగ్‌పూర్‌
     ప్రకటించిన ఆస్తులు:    రూ.25.12 కోట్లు
     2014లో ఆస్తులు: రూ.28.04 కోట్లు
     స్థిరాస్తులు: రూ.69.38 లక్షలు
     చరాస్తులు: రూ.91.99 లక్షలు
     పెట్టుబడులు: రూ.3.55 లక్షలు
     బ్యాంక్‌ బ్యాలెన్స్‌: రూ.8.99 లక్షలు, భార్య పేరిట రూ.11 లక్షలు)
∙అప్పులు: రూ.1.57 కోట్లు
∙క్రిమినల్‌ కేసులు: లేవు
∙అధీనంలోని భూమి: నాగ్‌పూర్‌లోని ధపేవాడలో 29 ఎకరాలు. ఇందులో 15 ఎకరాలు భార్య పేరుతో, 14.60 ఎకరాలు
కుటుంబ ఉమ్మడి ఆస్తిగా నమోదైంది. నాగ్‌పూర్‌లోని మహల్‌ ప్రాంతంలో పూర్వీకుల ఇల్లు, ముంబైలోని ఎమ్మెల్యే సొసైటీలో
ఒక ఫ్లాట్‌.

ఊర్మిళ మటోండ్కర్‌   
(కాంగ్రెస్‌ పార్టీ)
     పోటీ చేస్తున్న స్థానం:    ముంబై నార్త్‌
     ప్రకటించిన ఆస్తులు:    రూ.68.88 కోట్లు
     స్థిరాస్తులు:    రూ.41.24 కోట్లు
     చరాస్తులు:    రూ.27.64 కోట్లు
     క్రిమినల్‌ కేసులు:    లేవు

ప్రియా దత్‌ (కాంగ్రెస్‌ పార్టీ)
     పోటీ చేస్తున్న స్థానం:    ముంబై నార్త్‌ సెంట్రల్‌
     స్థిరాస్తులు: రూ.72 కోట్లు (2014: రూ.60.30 కోట్లు)
     చరాస్తులు: రూ.24.20 కోట్లు (2014: రూ.6 కోట్లు)
     పెట్టుబడులు: రూ.55.50 లక్షలు
     బ్యాంక్‌ బ్యాలెన్స్‌:రూ.8.05 కోట్లు
     అప్పులు:    రూ.3.5 కోట్లు
     క్రిమినల్‌ కేసులు:    లేవు

డింపుల్‌యాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ)
     పోటీ చేస్తున్న స్థానం:    కనౌజ్‌
     ప్రకటించిన ఆస్తులు:    రూ.37.78 కోట్లు
     2014లో ఆస్తులు:    రూ.28.04 కోట్లు
     స్థిరాస్తులు:    రూ..26.20 కోట్లు (2014: రూ.21.71 కోట్లు)
     చరాస్తులు:    రూ.11.58 కోట్లు (2014: రూ.6.33 కోట్లు)
     పెట్టుబడులు:    రూ.55.50 లక్షలు
     బ్యాంక్‌ బ్యాలెన్స్‌:    రూ.8.05 కోట్లు
     అప్పులు:        రూ.14.26 లక్షలు
     క్రిమినల్‌ కేసులు:    లేవు
     అధీనంలోని భూమి:    రూ.8.39 కోట్ల విలువైన 18.74 ఎకరాలు, 925.36 చదరపు అడుగుల ప్లాట్‌. రెండు ఇళ్లు.

రాహుల్‌ గాంధీ
 (కాంగ్రెస్‌ పార్టీ  జాతీయ అధ్యక్షుడు)
     పోటీ చేస్తున్న స్థానం:    వయనాడ్‌ (కేరళ)
     ప్రకటించిన ఆస్తులు:    రూ.15.88 కోట్లు
     2014లో ఆస్తులు: రూ.9.4 కోట్లు
     స్థిరాస్తులు: రూ.10.08 కోట్లు (2014: రూ.1.32 కోట్లు)
     చరాస్తులు: రూ.5.80 కోట్లు (2014: రూ.8.07 కోట్లు)
∙అప్పులు:రూ.72 లక్షలు
     క్రిమినల్‌ కేసులు: 5 (పరువు నష్టం దావాలు నాలుగు ఉన్నాయి. నేషనల్‌
హెరాల్డ్‌కు సంబంధించిన కేసు మరొకటి నమోదై ఉంది)

మరిన్ని వార్తలు