వైఎస్‌ జగన్‌ను కలిసిన దాసరి అరుణ్‌

14 Mar, 2019 14:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత దర్శక, నిర‍్మాత దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్‌ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అనంతరం దాసరి అరుణ్‌ మీడియాతో మాట్లాడుతూ... వైఎస్సార్‌ సీపీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి పార్టీలో చేరా. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తా...అని తెలిపారు. మా నాన్న దాసరి నారాయణరావు ఉండుంటే వైఎస్సార్ సీపీ నుండి పోటీ చేసేవారు. వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ప్రచారానికి వెళతాను. కాగా ఇప్పటికే ప్రముఖ హాస్యనటుడు అలీ వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు