బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...

23 Jan, 2020 17:40 IST|Sakshi

సాక్షి, అమరావతి : వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోవాలని ప్రతిపక్ష టీడీపీ తొలి నుంచి కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా  విమర్శించారు. బిల్లుపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరమే మండలికి పంపామని అన్నారు. మండలిలో బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం వెళ్లకుండా బిల్లును అడ్డుకోవాలని కొత్తగా రూల్‌ 71ని తెచ్చారని మండిపడ్డారు. గురువారం అసెం‍బ్లీలో చర్చలో భాగంగా అంజాద్‌ బాషా ప్రసంగించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బిల్లుకు ప్రాధాన్యత ఇవ్వాలని చైర్మన్‌ను తాము కోరామని, కానీ ఆయనకు దానికి విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు.

రూల్‌ ప్రకారం వెళ్లాలని సభలో బీజేపీ, పీడీఎఫ్‌ సభ్యులు సూచించినా, ఆయన కనీస మర్యాద పాటించలేదని అంజాద్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు జవాబుదారితనంలా సభా కార్యక్రమాలు ఉండాలని, కానీ చైర్మన్‌ సభను టీడీపీ వ్యవహారంలా నడిపారని విమర్శించారు.ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రజల సమస్యలపక్ష కనీస చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు. మండలిలో బలం ఉందని టీడీపీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు