ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ఇదే

6 Oct, 2018 16:00 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను శనివారం మధ్యాహ్నం కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. త్వరలోనే అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోనూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ రావత్‌ ప్రకటించారు. ఈ మేరకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించారు. డిసెంబర్‌ 15లోగా ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్ : రెండు దశలలో పోలింగ్ నిర్వహణ. మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. 
 తొలి దశ పోలింగ్ - నవంబర్ 12, రెండో విడత పోలింగ్- నవంబర్ 20. మొదటి దశలో 18 స్థానాలకు, రెండో దశలో 72స్థానాలకు ఎన్నికలు.

మధ్యప్రదేశ్, మిజోరం : ఒకే విడత పోలింగ్. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 28న పోలింగ్.
మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాల సంఖ్య 230, మిజోరం 40

రాజస్తాన్, తెలంగాణ : ఒకే విడత పోలింగ్, డిసెంబర్ 7న పోలింగ్.
రాజస్తాన్‌ అసెంబ్లీ స్థానాల సంఖ్య 200, తెలంగాణ 119
ఫలితాలు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు.

మరిన్ని వార్తలు