ఎగ్జిట్‌ పోల్స్‌ : కేంద్రంలో మళ్లీ ఎన్డీయే

19 May, 2019 18:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగియడంతో అందరిలో ఉత్కంఠ పెంచిన ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదలయ్యాయి. కేంద్రంలో మళ్లీ నరేంద్ర మోదీ సారథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు అధికార పగ్గాలు దక్కుతాయని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాయి. మోదీకి వ్యతిరేకంగా బీజేపీయేతర పార్టీలు వీలైనన్ని చోట్ల కూటమి కట్టినా,యూపీలో ఎస్పీ-బీఎస్పీ చేతులు కలిపినా ఎన్డీయేకు విస్పష్ట మొగ్గు కనిపిస్తోందని స్పష్టం చేశాయి.2014 లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే కాషాయ ప్రభ కాస్త మసకబారినా లోక్‌సభలో బీజేపీనే ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, మిత్రుల తోడ్పాటుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేశాయి.

మీడియా సంస్థ

ఎన్డీయే యూపీఏ

ఇతరులు

టైమ్స్‌నౌ 306 132 104
రిపబ్లిక్‌ టీవీ సీ ఓటర్‌ 287 128 127
రిపబ్లిక్‌ టీవీ జన్‌ కీ బాత్‌ 315 124 113
న్యూస్‌ ఎక్స్‌ 242 162 136
న్యూస్‌ నేషన్‌ 282-290 118-126 130-138
ఎన్డీటీవీ పోల్‌ ఆఫ్‌ పోల్స్‌ 300 127 115
టుడేస్‌ చాణక్య 340 70 133
వీడీపీ అసోసియేట్స్‌ 333 115 94

యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమిలో కాంగ్రెస్‌ లేకపోవడం బీజేపీకి కలిసివచ్చినట్టుగా కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో దాదాపుగా ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ ఎన్డీయేకు పట్టం కట్టాయి. ఇక టైమ్స్‌నౌ ఎన్డీయేకు 306 స్ధానాలు, యూపీఏకు 132 స్ధానాలు, ఇతరులకు 104 స్ధానాలు దక్కుతాయని అంచనా వేసింది. రిపబ్లిక్‌ సీ ఓటర్‌ ఎన్డీయేకు 287 , యూపీఏకు 128 స్ధానాలు, ఇతరులకు 127 స్ధానాలు లభిస్తాయని పేర్కొంది.

రిపబ్లిక్‌ జన్‌ కీ బాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ఎన్డీయేకు 315 స్ధానాలు, యూపీఏకు 124 స్ధానాలు, ఇతరులకు 113 స్ధానాలు రావచ్చని అంచనా వేశాయి. మరోవైపు న్యూస్‌ ఎక్స్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ఎన్డీయేకు 298 స్ధానాలు, యూపీఏకు 118 స్ధానాలు, ఇతరులకు  126 స్ధానాలు లభించనున్నాయి. టైమ్స్‌ నౌ ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్డీయేకు స్ధానాలు, యూపీఏకు స్ధానాలు, ఇతరులకు స్ధానాలు దక్కనున్నాయి. ఎన్డీటీవీ పోల్స్‌ ఆఫ్‌ పోల్స్‌లో ఎన్డీయేకు 300, యూపీఏకు 127, ఇతరులకు 115 స్ధానాలు రావచ్చని అంచనా వేసింది.

మరిన్ని వార్తలు