బీజేపీలో చేరిన గంభీర్‌

22 Mar, 2019 12:59 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. చేరికలు.. కూటములతో రాజకీయ చిత్రం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గ‌త కొద్దిరోజులుగా బీజేపీలో చేరతార‌నే వార్త‌లపై ఆచితూచి స్పందించిన గంభీర్ చివ‌ర‌కు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, రవి శంకర్‌ ప్రసాద్‌ సమక్షంలో శుక్రవారం బీజేపీలో చేరారు.

ఈ సదర్భంగా అరుణ్‌ జైట్లీ మాట్లాడుతూ.. ‘బీజేపీ గౌతమ్ గంభీర్‌ను సాదరంగా ఆహ్వానిస్తుంది. కాంగ్రెస్‌ పార్టీలో ఆల్రేడి ఒక క్రికెటర్‌ ఉన్నారు. అయితే ఆయన పాకిస్తాన్‌ పట్ల జాలి చూపిస్తారు. కానీ గౌతమ్‌ గంభీర్‌ అటువంటి వ్యక్తి  కారం’టూ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూఉద్దేశిస్తూ జైట్లీ విమర్శలు చేశారు.  పార్టీలో చేరిన సందర్భంగా గౌతమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీలో చేరినందుకు సంతోషంగా ఉంది. మోదీ దార్శనికతకు నేను అభిమానిగా మారిపోయాను. ఈ పార్టీలో చేరడాన్ని నేను గౌరవంగా భావిస్తున్నా’ని తెలిపారు. అయితే ఈ ఎన్నికల్లో గౌతమ్‌ బీజేపీ తరఫున పోటీ చేసి అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు