రాజధానిలో ముదురుతున్న పాంప్లెట్ల వివాదం

10 May, 2019 16:42 IST|Sakshi

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆప్‌, బీజేపీ పార్టీల మధ్య ప్రారంభమైన పాంప్లెట్ల వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. ఆతిషి, గంభీర్‌ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పాంప్లెట్ల విషయంలో ఆప్‌ కావాలనే తన మీద అసత్య ఆరోపణలు చేస్తుందంటున్న గంభీర్‌.. కోర్టు ద్వారానే తేల్చుకుంటానని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వివాదంపై గంభీర్‌ మరోసారి స్పందించారు. ఈ పాంప్లెట్ల వ్యవహారంలో తన పాత్ర ఉందని నిరూపిస్తే.. బహిరంగంగా తనను తాను ఉరి తీసుకుంటానని పేర్కొన్నారు గంభీర్‌. ఒక వేళ అసత్యమని తేలీతే.. రాజకీయాల నుంచి తప్పుకోవాలి. ఇది మీకు సమ్మతమేనా కేజ్రీవాల్‌ అంటూ ట్విటర్‌ వేదికగా సవాల్‌ చేశారు గంభీర్‌. అంతేకాక తన మీద ఆప్‌ చేస్తోన్న ఆరోపణలు ఆధారాలు చూపించాలని.. లేదంటే పరువు నష్టం దావా వేస్తానని గంభీర్‌ హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఈ వివాదంపై ఆతిషి స్పందిస్తూ.. ఆత్మాభిమానం కల మహిళ ఎవరైనా తన గురించి తానే నీచంగా ప్రచారం చేసుకోగలదా అని ప్రశ్నించారు. బీజేపీ కావాలనే తన మర్యాదకు భంగం కల్గించడం కోసం ఇలాంటి నీచ ప్రచరాన్ని ప్రారంభించిందని మండిపడ్డారు. మహిళలు రాజకీయాల్లోకి రాకపోవడానికి ఇలాంటి నాయకులే ప్రధాన కారణమన్నారు.

>
మరిన్ని వార్తలు