ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా: చెవిరెడ్డి

23 Feb, 2019 18:58 IST|Sakshi

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఆరోపించారు. తిరుపతిలో చెవిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..యర్రావారిపాలెంలో వైఎస్సార్‌సీపీ సానుభూతి ఓటర్లను తొలగించడానికి వచ్చిన వారిని మా పార్టీ నేతలు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారని తెలిపారు.  టీడీపీ పెద్దల ఒత్తిడితో వారిని వదిలిపెట్టారని అన్నారు. దేశ చరిత్రలో ఇంత దారుణం మరెక్కడా జరగలేదన్నారు.

ఒక్క చంద్రగిరి నియోజకవర్గంలోనే వైఎస్సార్‌సీపీకి చెందిన 14500 ఓట్లు తొలగించారని వెల్లడించారు. దీనిపై తాను ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఇప్పుడు యర్రావారి పాలెంలో మా పార్టీ నేతలు మరోసారి అనుమానితులను పోలీసులకు పట్టించారు.. కానీ పోలీసులు టీడీపీ పెద్దల ఒత్తిడికి తలొగ్గారని అన్నారు. పైపెచ్చు ఇప్పుడు మా పార్టీ నేతల మీదే కేసులు పెడుతున్నారని, ఇది చాలా దుర్మార్గమన్నారు. దీనిపై కోర్టులను కూడా ఆశ్రయిస్తానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటానని తెలిపారు.
 

మరిన్ని వార్తలు