సొంతపార్టీ నేతపై జేసీ సంచలన వాఖ్యలు

5 Sep, 2018 15:26 IST|Sakshi

సాక్షి, అనంతపురం : వర్గ విభేదాలతో అనంతపురంలో టీడీపీ పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ప్రభాకర్‌పై జేసీ బుధవారం సంచలన వాఖ్యలు చేశారు. అనంతపురంలో రోడ్ల వెడల్పుకు ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రభాకర్‌ చౌదరి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

మున్సిపల్ భవనాల అద్దె డబ్బు మేయర్‌తో కలిసి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఆర్కియాలజీకి అప్పగించిన పీస్‌ మెమోరియల్‌ హాల్‌పై ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి పెత్తనం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో దౌర్జన్యాలు, రౌడీయిజం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పోరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

జిల్లాకో బహిరంగ సభ

ఎన్నికలు సమీపిస్తుంటే గుర్తొచ్చామా?

నవరత్నాలతో నవోదయం

ఛత్తీస్‌గఢ్‌లో అజిత్‌ జోగీతో బీఎస్పీ జట్టు

కాపలాదారుడే దొంగయ్యాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధనుష్‌ దర్శకత్వంలో 'అనూ'

త్రిష నటిస్తే అది వేరేగా ఉండేది..!

ఏ హీరోతో అయినా నటిస్తాను..

పాత ట్యూన్‌కి కొత్త స్టెప్స్‌

మలేసియాలో మస్త్‌ మజా

నేను అనుకున్నవన్నీ జరుగుతాయి