రేసులో అపశ్రుతి.. యువకుడి దుర్మరణం

5 Sep, 2018 15:15 IST|Sakshi

సాక్షి, హుబ్లీ : కర్నాటకలోని హుబ్లీలో దారుణం చోటుచేసుకుంది. గుర్రపు బండి పోటీల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న గుర్రపు బండి పైనుంచి ప్రమాదవశాత్తూ ఓ యువకుడు కిందపడి మృతిచెందాడు. హుబ్లీలోని భూదానగడ్డ బసవేశ్వర ఆలయం ఆధ్వర్యంలో బుధవారం గుర్రపు బండ్ల రేసు నిర్వహించారు.

అయితే ఈ రేసులో పాల్గొన్న ఓ యువకుడు గుర్రపు బండి నుంచి కిందపడి వెనకాలే వస్తున్న మరో గుర్రపు బండి కిందపడి మృతిచెందాడు. ఈ గుర్రపు బండ్ల రేసుకి నిర్వాహకులు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని తెలుస్తోంది. రోడ్డు పక్క నుంచి తిలకిస్తున్న యువకులు తీసిన వీడియోలో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతరిక్షానికి నిచ్చెన వేద్దాం..

‘యూపీఏ-3 ఏర్పాటు చేస్తాం’

కుంభమేళాలో అగ్నిప్రమాదం

‘అఖిలేష్‌ కాంగ్రెస్‌ను మోసం చేస్తున్నారు’

‘ఆయన చేతులు నరికేయాలనిపించింది’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హారోయిన్స్‌

ప్రభాస్‌ పెళ్లి అప్పుడే

నిను వీడను

సైరా.. జాతర!

కూర్చోనివ్వని సినిమా 

నేనే రాణి.. నేనే మంత్రి