జేడీఎస్‌ గెలవకపోతే నేను బతకను: కుమారస్వామి

11 May, 2018 02:44 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఎన్నికలకు కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం మిగిలి ఉండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సెంటిమెంట్‌ అస్త్రం ప్రయోగించారు. గురువారం ఆయన బెంగళూరు నగరంలోని ఆర్‌.ఆర్‌.నగర్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు. ‘నన్ను గెలిపిస్తే మిమ్మల్ని కాపాడతా, లేదంటే నేను ఎక్కువ రోజులు బతకను..జేడీఎస్‌ పార్టీ, మా భవిష్యత్‌ మీ తీర్పుపైనే ఆధారపడి ఉంది. జేడీఎస్‌కు అధికారమిస్తే కుటుంబ సభ్యుడిలా సేవలు చేస్తా.. కుమార స్వామి మరికొంత కాలం బతకాలని కోరుకుంటే జేడీఎస్‌కు అధికారం అప్పగించండి..’అంటూ ఉద్వేగంతో ప్రసంగించారు.

మరిన్ని వార్తలు