ఇలా అయితే మోదీని ఓడించలేం..

23 Jul, 2018 14:09 IST|Sakshi

సాక్షి, అహ్మదాబాద్‌ : విపక్షాల ఐక్యతపై స్పష్టమైన అజెండా కొరవడటంతో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడంపై దళిత నేత, గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవాని సందేహం వ్యక్తం చేశారు. ‘  రెండు కోట్ల ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువస్తానన్న మోదీ విఫలమయ్యారు..అయితే ఉద్యోగ కల్పనకు ఇతర రాజకీయ పార్టీలు ఏం చేస్తాయన్నదీ పెద్ద సందేహంగా మిగిలింది. నిజాయితీ, చిత్తశుద్ధితో సానుకూల అజెండా లేకుండా బీజపీని ఓడించడం సాధ్యమా’ అని జిగ్నేష్‌ మెవాని ట్వీట్‌ చేశారు. కాగా జిగ్నేష్‌ మెవానీ గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇతర విపక్షాల మద్దతుతో పోటీచేసి వద్గాం నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

బీజేపీని మట్టికరిపించేందుకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లోగా విపక్షాలు ఏకతాటిపైకి రావాలని పలు బీజేపీయేతర పార్టీలు పిలుపు ఇస్తున్న సంగతి తెలిసిందే. గుజరాత్‌లో విపక్ష నేతలు కాంగ్రెస్‌తో పొత్తుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

మరోవైపు ఉమ్మడి లక్ష్యం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు