కేఏ పాల్‌ నామినేషన్‌ స్వీకరించని అధికారులు

25 Mar, 2019 19:15 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు గట్టి షాక్‌ తగిలింది. భీమవరంలో ఆయన నామినేషన్‌ను అధికారులు స్వీకరించలేదు. తాను భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా, నరసాపురం పార్లమెంట్‌ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నట్టు కేఏ పాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం సోమవారం నామినేషన్‌ వేసేందుకు కేఏ పాల్‌ భీమవరం చేరుకున్నారు.

అయితే భీమరంలో కేఏ పాల్‌ నామినేషన్‌ను రిటర్నింగ్‌ అధికారులు స్వీకరించలేదు. ఆలస్యంగా రావడం వల్లే కేఏ పాల్‌ నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. సమయం ముగియడంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ రోజే నామినేషన్లు వేసేందుకు చివరిరోజు కావడంతో కేఏ పాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనట్లే. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ కోసమే కేఏ పాల్‌ నామినేషన్‌ కేంద్రానికి ఆలస్యంగా వచ్చారనే ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు