పూర్తి మేనిఫెస్టోను చూస్తే నిలబడరేమో!: కడియం

20 Oct, 2018 02:50 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న కడియం

కాజీపేట అర్బన్‌: టీఆర్‌ఎస్‌ పాక్షిక మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలు ఆమోదించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. నవంబర్‌ మొదటి వారంలో విడుదలయ్యే పూర్తి స్థాయి మేనిఫెస్టోను చూసి విపక్షాల అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకుంటారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం హన్మకొండలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  దోపిడీ దొంగలంతా కాంగ్రెస్‌ పార్టీలోనే చేరారని కడియం ఎద్దేవా చేశారు.

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ హౌసింగ్‌ కుంభకోణంలో, మాజీ మంర్రులు డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డితోపాటు కాంగ్రెస్‌ పార్టీ నేతలు అనేక కేసుల్లో ఉన్నారని ఆరోపించారు.  దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన, ప్రకటించని పలు సంక్షేమ పథకాలను అందించి కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నా రని కితాబిచ్చారు.  తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు.  డిప్యూటీ సీఎం స్థాయి వారు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు అభియోగం మోపడం దారుణమన్నారు. తాను, తన కూతు రు కాంగ్రెస్‌లో చేరేది లేదని స్పష్టం చేశారు.  

మరిన్ని వార్తలు