కర్ణాటకం : రాజీనామాకు సిద్ధమైన సీఎం

22 Jul, 2019 19:46 IST|Sakshi

బెంగళూర్‌ : కర్ణాటకలో రాజకీయం నిమిషానికో మలుపు తిరుగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి రాజీనామాకు సిద్ధమయ్యారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చూపించారు. బలపరీక్షకు ముందే కుమారాస్వామి రాజీనామాను ప్రకటించనున్నారు. సంకీర్ణ సర్కార్‌ భవితవ్యం తేల్చే విశ్వాస పరీక్షకు డెడ్‌లైన్లు మారుతూనే ఉన్నాయి. బలపరీక్ష గడువు పెంచాలన్న జేడీఎస్‌-కాంగ్రెస్‌ నేతల అభ్యర్ధనను స్పీకర్‌ ఆర్‌ రమేష్‌ కుమార్‌ తోసిపుచ్చారు. సోమవారం రాత్రి 9 గంటల వరకూ బలపరీక్షకు సమయం ఇచ్చిన స్పీకర్‌ ఇక వాయిదాలకు ఆస్కారం లేదని సంకీర్ణ నేతలకు స్పష్టం చేశారు. బలపరీక్షను వాయిదా వేయాలని ఒత్తిడి పెంచితే తానే రాజీనామా చేస్తానని ఆయన తేల్చిచెప్పారు. తాను చెప్పినట్టు బలపరీక్ష చేపట్టాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.

సుప్రీం కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నందున బలపరీక్షను రేపటికి వాయిదా వేయాలని కోరిన జేడీఎస్‌ వినతిని ఆయన అంగీకరించలేదు. బలపరీక్షపై గందరగోళంతో సభ వాయిదా పడటంతో విరామ సమయంలో స్పీకర్‌తో బీజేపీ సభ్యులు భేటీ అయ్యారు. ఎట్టిపరిస్థితుల్లో ఈరోజే బలపరీక్ష నిర్వహించాలని వారు పట్టుబట్టారు. బలపరీక్షకు తాను సిద్ధమని స్పీకర్‌ వారితో స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్లైమాక్స్‌కు చేరిన కన్నడ రాజకీయాలు

బలపరీక్షకు ముందే కుమారస్వామి రాజీనామా..?

సాధ్విని మందలించిన జేపీ నడ్డా!

‘బీజేపీ నా భర్తను వేధిస్తోంది’

‘చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం తీసుకున్నారు’

‘సాధ్వి ప్రజ్ఞా.. మోదీ వ్యతిరేకురాలు’

‘24 గంటల్లోనే కాంగ్రెస్‌లో చీలిక’

చింతమడక వాస్తు అద్భుతం: కేసీఆర్‌

టీడీపీ రాద్ధాంతంపై సీఎం ఆగ్రహం

‘టీడీపీ, జనసేన నుంచే ఎక్కువ’

‘కేసీఆర్‌.. జగన్‌ను చూసి నేర్చుకో’

పార్లమెంట్‌లో ఇచ్చిన మాట శాసనమే

‘లోకేశ్‌ ఆ వ్యాధికి లోనయ్యారు’

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటక రాజకీయం

పాక్‌ ప్రధాని ప్రసంగం.. నినాదాలతో రచ్చరచ్చ!

టాయిలెట్లు శుభ్రం చేయాలా: ఎంపీ ఆగ్రహం

అందుబాటులోకి మరిన్ని వైద్య సేవలు: ఆళ్ల నాని

సీపీఐ పగ్గాలు అందుకున్న రాజా

షీలాకు కన్నీటి వీడ్కోలు

ప్రతిపక్ష ఎంపీలపై బీజేపీ వల!

కర్నాటకంలో కాంగ్రెస్‌ సీఎం!

2 కోట్లు.. ఓ పెట్రోల్‌ బంకు

సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా డి.రాజా

కర్ణాటకం : సంకీర్ణ సర్కార్‌కు మరో షాక్‌

ఛీటింగ్‌ చేసి ఎన్నికల్లో గెలిచారు: దీదీ

కిషన్‌రెడ్డి పర్యటన.. ఫ్లెక్సీలు తగలబెట్టడంతో ఉద్రిక్తత

‘చంద్రబాబు కోటరీలో వణుకు మొదలైంది’

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

చంద్రబాబు వైఫల్యంతోనే... 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4