మహిళా ఎఫ్‌ఆర్వోపై దాడి.. స్పందించిన కేటీఆర్‌

30 Jun, 2019 18:05 IST|Sakshi

హైదరాబాద్‌ : సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిపై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని కేటీఆర్‌ స్పష్టం చేశారు. కోనేరు కృష్ణపై కేసు నమోదయిందని.. పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సీఎం కేసీఆర్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటపై సమగ్ర విచారణ జరిపించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

కాగా, ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కొత్త సారసాల గ్రామంలో విధి నిర్వహణలో ఉన్న మహిళా అధికారిపై కోనేరు కృష్ణ తన అనుచరులతో కలిసి దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చదవండి :

 మహిళా ఎఫ్‌ఆర్వోపై ఎమ్మెల్యే సోదరుడి దాడి.!

 నేను బతుకుతానని అనుకోలేదు: ఎఫ్‌ఆర్వో అనిత 

మరిన్ని వార్తలు