కడప: ఓటెత్తిన ఉత్సాహం

12 Apr, 2019 11:24 IST|Sakshi

సాక్షి, కడప: జిల్లాలో మొత్తంమీద పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఉదయం తొలుత రెండు గంటలుఈవీఎంలు మొరాయించినందున పోలింగ్‌శాతం మందకొడిగా నడిచింది. 9గంటలకు జిల్లా వ్యాప్తంగా 7.68శాతం మాత్రమే నమోదైంది. 11గంటలకు 17.84శాతం నమోదైయ్యింది. 11 గంటల తర్వాత పోలింగ్‌ శాతం గణనీయంగా పెరిగింది. సాయంత్రం 6గంటలకు 71.3శాతం పోలింగ్‌ నమోదయిది. పోలింగ్‌శాతం పెరిగినా గత 2014 ఎన్నికలు పోలిస్తే  5.5శాతం పోలింగ్‌ తగ్గినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పోలింగ్‌ సరళి ఇలా ఉంటే ఎన్నికలు జరిగిన తీరుపై ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది.

జిల్లాలో 2726 పోలింగ్‌ బూత్‌లు ఉండగా 768 సమస్యాత్మక పోలింగ్‌ బూత్‌లు. ఎక్కడ ఎలాంటి ఘటన తలెత్తుతుందో తెలియని పరిస్థితి. కానీ  స్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అవి కూడా నేతల అధికార దర్పం వల్ల జరిగినవే. బాధ్యతాయుతమైన ఎంపీ çహోదాలో ఉంటూ రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు, వైఎస్సార్‌సీపీ వర్గీ యుడు సుధాకర్‌రెడ్డిపై చేయి చేసుకున్నారు. హోదా, అధికారంలో ఉన్నామన్న దర్పమే రమేష్‌నాయుడుతో దాడి చేయించింది.  తన కారుతో సుధాకర్‌రెడ్డి కాలుపై ఎక్కించి మరింత రెచ్చిపోయారు.  జమ్మలమడుగు నియోజకవర్గంలో గూడెంచెరువు, పోన్నతోట గ్రామాలల్లో టీడీపీ వర్గీయులు వైఎస్సార్‌సీపీ వర్గీయులపై రాళ్లదాడికి పాల్పడ్డారు.  

జిల్లాలో పోలింగ్‌ సరళికి సంబంధించి నియోజకవర్గాల వారీగా పట్టిక 

అలవలపాడులో కవ్వింపు చర్యలు...: ఫ్యాక్షన్‌ గ్రామమైన అలవలపాడులో టీడీపీ వర్గీ యుల కవ్వింపు చర్యలు కారణంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఇదివరకే రాజకీయ హత్యలు చోటుచేసుకున్న ఆగ్రామంలో పోలింగ్‌ బూత్‌లు సమీపంలో కూర్చొన్నవారిని ఉద్దేశించి పరుషపదజాలంతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈనేపథ్యంలో తలెత్తిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన నలుగురికి గాయాలైయ్యాయి. మైదుకూరు నియోజకవర్గంలో మీర్జాం పల్లెలో టీడీపీ వర్గీయులు దాడి చేసిన ఘటనలో అయిదుగురు వైఎస్సార్‌సీపీ వర్గీయులకు గాయాలయ్యాయి. రాజంపేట మండలం చవణవారిపల్లెలో ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు.

నందలూరు మండలం చెన్నయ్యగారిపల్లె వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి మేనల్లుడిపై దాడి చేశారు. ఎన్నికల్లో పోలింగ్‌ ఏజెంట్లుగా ఉన్నారని, ఓట్లు కోల్పోతున్నామనే భావనతో చోటుచేసుకున్న దాడులేనని పలువురు వివరిస్తున్నారు. వేంపల్లెలో 212 బూత్‌లో పోలిం గ్‌ ఏజెంటుగా ఉన్న నామా కిశోర్‌ను తొలగించాలని మధ్యాహ్నం తర్వాత టీడీపీ అభ్యర్థి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి సోదరుడు విష్ణువర్ధన్‌రెడ్డి వాదులాటకు దిగారు. పోలింగ్‌ అధికారులు వివరిస్తున్నా పట్టించుకోకుం డా హంగామా చేశారు. విష్ణువర్ధన్‌ రెడ్డి ఉద్దేశాన్ని పసిగట్టిన వైఎస్సార్‌సీపీ వర్గీయులు పోలింగ్‌ బూత్‌ నుంచి నామాకిశోర్‌ను బయటికి పంపించారు.  పలుచోట్ల టీడీపీ వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, దాడులకు తెగబడడం తెరపైకి వచ్చాయి.

అందరికీ ధన్యవాదాలు

సాక్షి కడప : సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపుకోసం కష్టించి పనిచేసిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలకు, నాయకులకు, పోలింగ్‌ ఏజెంట్లకు కడప మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. అందుకు సంబంధించి ఎన్నికల నేపధ్యంలో ఆవిరళ కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. షెడ్యూలు ప్రకటన వెలువడింది మొదలు తన వెన్నంటి నిలిచిన కార్యకర్తలందరి ఆదరాభిమానాలను ఎన్నటికీ మర్చిపోనన్నారు. ఎన్నికల్లో ఓటర్లంతా చైతన్యంగా పాల్గొన్నారని సంతోషం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు