‘అలా అనడానికి బాబుకు సిగ్గుండాలి’

4 Jun, 2020 14:55 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు దళితుల భూములను లాక్కున్నారని, దళిత మహిళలను వివస్త్రలను చేసి టీడీపీ నేతలు దాడులు చేశారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అంటూ చంద్రబాబు దళితులని అవహేళన చేశారని, రాజధానిలో దళితులపై దాడులు చేయించారని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ దళితులకు అన్యాయం చేసిన ఘనత చంద్రబాబుదే. దళిత నిధులను కూడా ఆయన దోచుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను దళిత ద్రోహి అనడానికి బాబుకు సిగ్గుండాలి. అంబేద్కర్ ఆశయాలను అమలు చేసేది సీఎం జగన్ మాత్రమే. దళిత సంక్షేమం, నిధులపై ప్రతిపక్ష నేతతో బహిరంగ చర్చకు మేము సిద్ధం. దళితుల కోసం కేటాయించిన నిధుల్లో 59 శాతం మాత్రమే చంద్రబాబు ఖర్చు చేశారు. ( చంద్రబాబు డైరెక్షన్‌‌లో.. డాక్టర్‌ సుధాకర్‌ )

దళితుల నిధులను ఆయన దారి మళ్లించారు. సీఎం జగన్‌ దళితులకు కేటాయించిన నిధుల కంటే అదనంగా ఖర్చు చేశారు. టీడీపీ నేతలు దళితుల నిధులను కాజేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో దళిత సంక్షేమం విరాజిల్లింది. దళితులను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. డాక్టర్ సుధాకర్ ప్రధాని, సీఎంలపై ఇష్టానుసారంగా విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడ్ని ఏయూ ప్రొఫెసర్ ప్రేమానంద్ ఛీత్కరించుకున్నా సిగ్గు లేదు. సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత టీడీపీ దళిత నేతలకు లేదు. దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని అన్న చంద్రబాబును ప్రశ్నించలేని దద్దమ్మలు వర్ల, నక్కా, జవహర్‌లు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు