‘బాబు డబ్బులు ఇచ్చి మరీ లైన్‌లోకి పంపుతున్నారు’

5 May, 2020 18:12 IST|Sakshi

చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి పేర్ని నాని

సాక్షి, తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని మంత్రి పేర్ని నాని అన్నారు. దేశ వ్యాప్తంగా లిక్కర్‌ షాపులకు ప్రధాని మోదీ మినహాయింపు ఇస్తే.. దీన్ని కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అసూయతో ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ప్రజలను ఆందోళనలకు గురిచేసేలా బాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి వైన్‌ షాపులకు పంపించి గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.
(చదవండి: ద్రోహం చేసింది చంద్రబాబే..!)

లైన్‌లోకి టీడీపీ కార్యకర్తలను పంపి ఎల్లో మీడియా ద్వారా క్షుద్ర రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చర్యలను లోకేష్‌ ఖండించకోవడం విచారకరమని అన్నారు. బ్రాందీ షాపులు తీయమన్నది మోదీ అయితే.. చంద్రబాబు ఏమో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ముందు మోదీని చెప్పరాని మాటలతో తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు జైలులో వేస్తారనే భయంతో ప్రేమ సందేశాలు పంపిస్తున్నాని ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు, ఈడీ కేసులతో చంద్రబాబు వణికిపోతున్నారని, అందుకే మోదీపై విమర్శలు చేయలేకపోతున్నారని పేర్ని నాని అన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు