కొత్త తరహాలో వాణిజ్యం, పెట్టుబడులు: విదేశాంగ శాఖ

12 Oct, 2019 14:54 IST|Sakshi

చెన్నై: భారత పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా వాణిజ్యం, పెట్టుబడులపైనే ఇరు దేశాధినేతలు ప్రధానంగా చర్చించారని విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. వాణిజ్యలోటును పరిష్కరించడానికి కొత్త యంత్రాంగాన్ని రూపొందించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే పేర్కొన్నారు. ఈ నూతన ఆలోచనలను కార్యరూపం దాల్చేందుకు చైనా వైస్ ప్రీమియర్, భారత ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నాయకత్వం వహిస్తారని ఆయన అన్నారు.

కాగా పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న చైనా ఇటీవల కాలంలో అనేక అంశాల్లో ముఖ్యంగా వాణిజ్యం విషయంలో భారత్‌కు మద్దతిస్తున్న విషయం తెలిసిందే. అమెరికాతో వాణిజ్య యుద్దం కారణంగా చైనా వృద్ధి రేటు ఆశాజనకంగా లేని కారణంగా... తమ ఎగుమతులకు అతిపెద్ద వినియోగదారు అయిన భారత్‌తో మైత్రి చైనా ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, కశ్మీర్‌లో భారత్‌ తీసుకున్న ఆర్టికల్‌ 370రద్దును చైనా సమర్థించిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు