ప్రణబ్‌ దా.. థాంక్యూ : మోహన్‌ భగవత్‌

7 Jun, 2018 20:33 IST|Sakshi

సాక్షి, నాగ్‌పూర్‌ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) ఏ ఒక్క వర్గానికో చెందినది కాదని, భారతీయులందరికీ చెందిన సంస్థ ఇదని ఆ సంస్థ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆరెస్సెస్‌ మూడో శిక్షా వర్గ్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. తమ ఆహ్వానాన్ని అంగీకరించి సదస్సుకు విచ్చేసిన ప్రణబ్‌ ముఖర్జీకి భగవత్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఆరెస్సెస్‌ సదస్సుకు ప్రణబ్‌ రావడాన్ని వివాదం చేయ్యొద్దని ఆయన సూచించారు. ప్రముఖులను ఆరెస్సెస్‌ సదస్సులకు ఆహ్వానించడం ఆనవాయితీ అని అన్నారు. ప్రణబ్‌తో తనకు మంచి స్నేహ సంబంధాలు  ఉన్నాయని తెలిపారు. అపార అనుభవం ప్రణబ్‌ సొంతమని ప్రశంసించారు. రాజకీయ వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశాభివృద్ధే మన లక్ష్యమని గుర్తుచేశారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ సహజ లక్షణమని, ఒక మతాన్ని గుప్పిట్లో పెట్టుకొని దేశ రాజకీయాలను శాసించాలనే భావనతో ఆరెస్సెస్‌ను స్థాపించలేదని చెప్పారు. ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ భారతీయులేనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు