ఏపీ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి

9 Mar, 2018 17:53 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అంతా మోసం, దగా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి విమర్శించారు. వ్యవసాయానికి ఎంతో చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు అరకొర కేటాయింపులే చేసిందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరి బడ్జెట్‌లో కూడా కేటాయింపులు చేయకుంటే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఓ పక్క ధాన్యానికి గిట్టుబాటు ధరలు లేకున్నా మరోపక్క, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నా చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉండిపోయారని నిలదీశారు. ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారని ప్రశ్నించారు. అంసెబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని అబద్ధాలే చెప్పారని దుయ్యబట్టారు. పంటల సాగు తగ్గిపోయి రైతుల వలసలు పెరగిపోతుంటే వ్యవసాయ రంగం ఎక్కడ బాగుందని ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకున్న ప్రభుత్వాలు ఇప్పటి వరకు మనుగడ సాగించలేదని, చంద్రబాబు ప్రభుత్వం కూడా ఎక్కువకాలం ఇక సాగబోదని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

14 మంది రెబెల్స్‌పై కొరడా

వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీకి షాక్‌

యూపీ అభివృద్ది సారథి యోగి : అమిత్‌ షా

కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్‌

తల్లి, కొడుకు కిస్‌ చేసుకున్నా తప్పేనా?

అయోమయ స్థితిలో కోడెల కుటుంబం

పాము చచ్చాక ఇక కర్ర ఎందుకు: కృష్ణంరాజు

ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు

కర్ణాటక స్పీకర్‌ సంచలన నిర్ణయం

టీపీసీసీ చీఫ్‌ రేసులో ఆ ఇద్దరు..!

కమల ప్రక్షాళన

'ఢిల్లీ నుంచి భయపెడతాం'

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌రెడ్డి కన్నుమూత

మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!

కేశినేని నానికి రామకృష్ణ కౌంటర్‌

‘అది సాహసోపేతమైన నిర్ణయం’

ఆజంను క్షమించే ప్రసక్తే లేదు : రమాదేవి

జమ్మూకశ్మీర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం

‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!

బీజేపీకి కుమారస్వామి మద్దతు!

ఎన్నికల వరకే రాజకీయాలు: ఎమ్మెల్యే శిల్పా

ఇంటింటికీ కాంగ్రెస్‌

జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే హానికరం

అవినీతి నిర్మూలనకే ‘ముందస్తు న్యాయ పరిశీలన’

ఆదర్శనీయంగా మా పాలన

ఆజం ఖాన్‌పై మండిపడ్డ మహిళా లోకం

కన్నడ పీఠంపై మళ్లీ ‘కమలం’

‘అది నిజంగా గొప్ప విషయం’

రాజగోపాల్‌ రెడ్డి, వివేక్‌ ఆలోచించాలి : రేవంత్‌

జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆ ముద్ర  చెరిగిపోయింది

తలైవి కంగనా

పూణే కాదు  చెన్నై 

ముహూర్తం కుదిరిందా?

వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన తమన్నా

హేమ అవుట్‌.. తమన్నా ఇన్‌