ఏమయ్యా పవన్‌నాయుడు అది నోరా.. లేక

21 Jan, 2020 17:08 IST|Sakshi

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై సోషల్‌ మీడియాలో వ్యంగ్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశంపై రోజుకో మాట మాట్లాడుతున్న పవన్‌ వైఖరిని నెటిజన్లు తప్పుబడుతున్నారు. పార్టీ పెట్టినప్పుడు ఒకలా.. ఎన్నికల సమయంలో మరోలా మాట్లాడిన పవన్‌.. తాజాగా అమరావతి రైతుల వద్ద మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఆయన మాట్లాడిన వీడియోలను పోస్టు చేసి.. పవన్‌నాయుడుకు క్లారిటీ ఇవ్వండయ్యా అని కొందరు నెటిజన్లు చురకలు వేస్తున్నారు. ‘మీరేం మాట్లాడుతున్నారో.. అర్థమవుతుందా’అని విమర్శిస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ మాదిరిగా అభివృద్ధి మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతమైతే.. ప్రాంతీయ వైషమ్యాలు తలెత్తుతాయని పవన్‌ గతంలో చెప్పిన విషయం తెలిసిందే.
(చదవండి : ‘ఢిల్లీ కోటనే ఢీకొన్న నేత సీఎం జగన్‌’)
(చదవండి : జనసేనతో రేపటి మీటింగ్‌ అందుకే: జీవీఎల్‌)

మరిన్ని వార్తలు