మహాకూటమిదే అధికారం: చాడ

11 Oct, 2018 05:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మహాకూటమే ప్రభుత్వాన్ని ఏర్పా టు చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. పార్టీ నేతలు అజీజ్‌పాషా, సుధాకర్‌తో కలిసి మఖ్దూంభవన్‌లో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేవిధంగా, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసమే మహాకూటమి ఏర్పాటైందన్నారు. మహా కూటమికి రోజురోజుకూ పెరుగుతోన్న ఆదరణ ను చూసి సీఎం కేసీఆర్‌ భయపడిపోతున్నారని తెలిపారు. కేసీఆర్‌ రాజకీయ పతనానికి మహా కూటమి ఏర్పాటుతోనే నాంది అన్నారు. అసెంబ్లీ రద్దుకు ముందు కేసీఆర్‌ చేయించుకున్న సర్వేలు, ఇంటెలిజెన్స్‌ నివేదికలన్నీ తలకిందులయ్యాయని, దీంతో ఆయన విచక్షణ కోల్పోయి ప్రతిపక్షాలపై నోరు పారేసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం కాపాడటమే మహాకూటమిలోని పార్టీలన్నింటి లక్ష్యమన్నారు.

సీట్ల సర్దుబాటులో ఇబ్బందిలేదు
మహాకూటమిలో సీట్ల సర్దుబాటులో ఇబ్బందులేమీ లేవని చాడ స్పష్టం చేశారు. సీపీఐ ప్రతిపాదించిన 12 స్థానాల్లో సభలు, సమావేశాలు, బూత్‌స్థాయిలో ప్రచార కార్యక్రమాలను చేపట్టిన ట్లు చెప్పారు. మరో వారం రోజుల్లోగా అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. టీఆర్‌ఎస్‌లోనూ అసమ్మతి తీవ్రమవుతోందన్నారు. చెన్నూరులో టీఆ ర్‌ఎస్‌ కార్యకర్త ఆత్మహత్యే దీనికి ఉదాహరణ అన్నారు. గుజరాత్‌లో జరిగిన ఓ ఘటనను మతపరమైనదిగా బీజేపీ చిత్రీకరించడంతోనే అక్కడి వలస కార్మికులు తిరిగి సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారని మాజీ ఎంపీ అజీజ్‌ పాషా అన్నారు.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆ బాధేంటో మాకు తెలుసు : రాహుల్‌, ప్రియాంక

‘వారు జవాన్‌లపై దాడి చేయలేదు’

మోదీ, ట్రంప్‌ను కూడా భీమిలి నుంచి పోటీ చేయమంటారేమో!

ఇంతకీ శవం ఎవరిదయ్యా లోకేష్‌?

ఇంటికి వచ్చి బేరం చేయాల్సిన అవసరమేంటి?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఎన్‌ఆర్‌ఐ’ని క్లాప్‌ కొట్టి ప్రారంభించిన అమల

మార్చి 1న ‘విశ్వాసం’

శర్వానంద్‌ న్యూ లుక్‌ చూశారా?

మొన్న క్రికెటర్‌గా.. నేడు రెజ్లర్‌గా!

మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన రానా!

అందుకే విడాకులు తీసుకున్నాం : మలైకా