ఓటుకు నోట్లిస్తూ పట్టుబడ్డ పోలీసులు

29 Mar, 2019 09:41 IST|Sakshi

పలాసాలో టీడీపీ ప్రలోభాల పర్వం

పోలీసులే డబ్బులు పంచుతున్న వైనం

సాక్షి, శ్రీకాకుళం : ఎన్ని అక్రమాలు, అరాచకాలు చేసైనా, చివరికి ప్రజలు ఛీకొట్టినా సరే అధికారం మాత్రం దక్కాలనే తీరుగా టీడీపీ వ్యవహరిస్తోంది. కరెన్సీ కట్టలతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు సిద్ధమైంది. ఎన్నికల సంఘం నిఘా నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పోలీసులనే రంగంలోకి దించారు పచ్చ నేతలు. పలాస టీడీపీ అభ్యర్థి గౌతు శిరీష తరపున పోలీసులు డబ్బులు పంచుతున్న వ్యవహారం బయటపడింది. వజ్రపుకొత్తూరుకు చెందిన పోలీసులు టీడీపీ నేతలతో కలిసి  ఓటర్లకు డబ్బులు పంచుతూ మీడియా కంటబడ్డారు.

జిల్లా పోలీసులు టీడీపీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నంను హెడ్‌ ఆఫీస్‌కు అటాచ్‌ చేస్తూ ఈసీ ఉత్తర్వులిచ్చింది. అయినా పరిస్థితుల్లో ఏ మార్పు కానరావడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అడుగడుగునా నిబంధనలకు పాతరేస్తున్న టీడీపీ ప్రభుత్వం.. కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులను కూడా తుంగలో తొక్కిన సంగతి తెలిసిందే. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఇంటలిజెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయాన్ని టీడీపీ హైకోర్టులో సవాల్‌ చేసింది.

(చదవండి : ఎన్నికల ప్రచారంలో..‘గౌతు’కు షాక్‌...!)

మరిన్ని వార్తలు