పునఃప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

3 Jul, 2018 16:08 IST|Sakshi

సాక్షి, రామచంద్రాపురం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 204వ రోజు మధ్యాహ్నం నుంచి ప్రారంభమైంది. కాగా, వర్షం కురుస్తుండటంతో కోలంక శివారు వద్ద పాదయాత్రను మధ్యాహ్నానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

కోలంక శివారు నుంచి వైఎస్‌ జగన్‌ ఉప్పుమిల్లి గ్రామానికి చేరుకున్నారు. వైఎస్‌ జగన్‌కు గ్రామస్థులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.

వైఎస్‌ జగన్‌ పాదయాత్ర గోదావరి జిల్లాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి వరుణుడు తరచుగా పలకరిస్తున్నాడు. గత రెండు రోజులుగా చిరుజల్లుల మధ్య వైఎస్‌ జగన్‌ పాదయాత్రను కొనసాగించారు. సోమవారం రాత్రి నుంచి వర్షాలు భారీ స్థాయిలో కురుస్తుండటంతో పాదయాత్రను మధ్యాహ్నానికి వాయిదా వేసుకున్నారు. ఇవాళ ద్రాక్షారామంలో జరగాల్సిన బహిరంగ సభ రేపు(బుధవారం) సాయంత్రం జరగుతుందని పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.

మరిన్ని వార్తలు