‘పీవీపై మన్మోహన్‌ వ్యాఖ్యలు అవాస్తవం’

5 Dec, 2019 14:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. పీవీపై మాజీ ప్రధాని చేసిన చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీపై నిందలు రాకూడదనే ఇలాంటి నిందలు వేస్తున్నారని విమర్శించారు. సిక్కుల ఊచకోత విషయంలో హోంమంత్రిగా వాటిని నివారించుటకు చర్యలు తీసుకున్నారు కానీ వాటికి కారణం ఆయన కాదని సుభాష్‌ అభిప్రాయపడ్డారు. గురువారం మన్మోహన్‌ వ్యాఖ్యలపై స్పందించిన సుభాష్‌.. కాంగ్రెస్‌ పార్టీ తొలి నుంచి పీవీపై నిందలు వేస్తూనే ఉందని అసహం వ్యక్తం చేశారు. పీవీపై మన్మోహన్‌ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పలని డిమాండ్‌ చేశారు.

కాగా సిక్కు అల్లర్లు  జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజ్రాల్‌ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు