బీజేపీ కంటే బ్రిటీష్‌ పాలనే మేలు: రఘువీరా

4 Oct, 2018 11:26 IST|Sakshi
ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి

ప్రొద్దుటూరు: బీజేపీ ప్రభుత్వం కంటే బ్రిటీష్‌ ప్రభుత్వ పరిపాలనే మేలు అనిపిస్తోందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు ఎన్‌ రఘువీరా రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులో విలేకరులతో మాట్లాడుతూ... రైతులను నమ్మించి బీజేపీ ప్రభుత్వం గొంతు కోసిందని విమర్శించారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవం రోజున హింసను ప్రోత్సహించిందని తూర్పారబట్టారు. జై జవాన్‌- జై కిసాన్‌ అనే నినాదం వదిలేసి జై జపాన్‌- జై కార్పొరేట్‌ అని అంటోందని ధ్వజమెత్తారు. కోర్టుఇచ్చిన ఫ్రీ సెక్స్‌ తీర్పు పైన బీజేపీ ప్రభుత్వం స్పందించకపోవడం అరాచకమని, ఇది మన సంప్రదాయానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

జీఎస్‌టీ అంటే గూడ్స్‌ సర్వీస్‌ టాక్స్‌ కాదని, గబ్బర్‌ సింగ్‌ టాక్స్‌గా పరిగణిస్తున్నామని వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు దేశవ్యాప్తంగా 2లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని, అలాగే జీఎస్‌టీని సరళీకృతం చేసి పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీతో పొత్తు గురించి ఇంకా ఆలోచనలు చేయలేదని అన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు