10 రోజుల్లోనే రైతు రుణ మాఫీ

7 Jun, 2018 02:34 IST|Sakshi

మంద్‌సౌర్‌/న్యూఢిల్లీ: తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 రోజుల్లోనే రైతు రుణ మాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదని ధ్వజమెత్తారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం మంద్‌సౌర్‌ జిల్లా పిప్లియా మండీలో పోలీసు కాల్పుల్లో ఆరుగురు రైతులు మృతి చెందిన ఘటనకు ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే రైతు రుణ మాఫీ చేస్తామని హామీ ఇస్తున్నా. పదకొండో రోజు దాకా కూడా ఆగబోం’ అని ప్రకటించారు. తమ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటక, పంజాబ్‌ రాష్ట్రాల్లో కూడా రైతు రుణమాఫీ అమలు చేశామన్నారు.

మరిన్ని వార్తలు