రాహుల్‌ అందుకే వయనాడ్‌లో గెలిచారు: ఒవైసీ

10 Jun, 2019 09:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వయనాడ్‌లో గెలుపునకు కారణం ముస్లిం ఓట్లేనని ఎంఐఎం చీఫ్‌, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అభిప్రాయపడ్డారు. వయనాడ్‌లో 40శాతానికి పైగా ముస్లింల ఓట్‌ బ్యాంక్‌ ఉందని, వారందరి ఓట్లు రాహుల్‌కే పడ్డాయని అందుకే భారీ మెజార్టీ వచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం ఒవైసీ ఓ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగానే ఉన్నారని ఒవైసీ అన్నారు. దానికి ఉదహరణగా.. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కేరళ, పంజాబ్‌ రాష్ట్రంల్లో ఆ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయని అభిప్రాయపడ్డారు. కాగా యూపీలోని అమేథిలో పాటు కేరళలోని వయనాడ్‌లో రాహుల్‌ పోటీ చేసిన విషయం తెలిసిందే. అనుకున్నట్లు గానే అమేథిలో ఓడిన రాహుల్‌. వయనాడ్‌లో 4,31,063 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. 

మరిన్ని వార్తలు