ఆ ప్రక్రియ 14ఏళ్లు సీఎంగా ఉన్న మీకు తెలియదా?

22 Jul, 2020 19:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమైంది అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. చంద్రబాబుగారూ.. మీ గురివింద నీతి. ప్రజాస్వామ్యం గురించి, ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి గురించి మీరు మాట్లాడటం విడ్డూరం. 2019 ఎన్నికల్లో మీరు ఎలా బెదిరించి, దబాయించారో అందరూ చూశారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి అంటూ ఎన్నికలకు ముందు అపద్ధర్మ సీఎంగా చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ద్వివేదిని ఉద్దేశించిన వీడియోను జతచేశారు.  ('చంద్రబాబు చేస్తున్న కుట్రే సునామీ అలజడి')

మీరు మాట్లాడే లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియరీ, మీడియా ఈ నాలుగు వ్యవస్థలను చుట్టాలుగానూ, పనిముట్లుగానూ మార్చుకునే అలవాటు మీకు ఉందని మీ మామగారికి వెన్నుపోటు దగ్గరనుంచి అందరికీ తెలుసు. ఎన్నికల వాయిదా ముందురోజు వరకూ అంతాబానే ఉందని, కరోనాపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిమ్మగడ్డే చెప్పారు. కానీ, ఎవ్వరితోనూ సంప్రదింపులు చేయకుండా, ప్రభుత్వంతో మాట్లాడకుండా హఠాత్తుగా వాయిదావేశారు. దీనిపైనే అభ్యంతరం. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపకపోవడం తప్పేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎస్‌ఈసీగా రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తి ఉంటే నిష్పాక్షికత, పారదర్శకత ఉంటుందని ప్రభుత్వం భావించి సంస్కరణలు తీసుకొచ్చింది. దీని పర్యవసానంగానే నిమ్మగడ్డ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. చట్టంద్వారా జరిగిన ప్రక్రియపై 14ఏళ్లు సీఎంగా ఉన్న మీకు తెలియదా? అంటూ వరుస ట్వీట్లలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. (నిమ్మగడ్డకు ఆ డబ్బులు ఎవరిస్తున్నారు?)

మరిన్ని వార్తలు