పది జన్మలెత్తినా అది నీవల్ల కాదు: స్మృతి

18 Jan, 2020 18:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి రెచ్చిపోయారు. రాహుల్‌ మరో పది జన్మలెత్తినా.. హిందూత్వ సిద్ధాంతకర్త వీర్‌ సావర్కర్‌కు ఉన్న ధైర్యం, తెగువ రాదని అన్నారు. శనివారం ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్మృతి సావర్కర్‌ గురించి ప్రస్తావించారు. ‘నా పేరు రాహుల్‌ గాంధీ. రాహుల్‌ సావర్కర్‌ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’ అని గతంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తుచేశారు. సావర్కర్‌ ధైర్య సాహసాలను ఆమె ప్రశంసించారు. ఏ విషయంలో కూడా వారిద్దరికి పోలిక లేదని అన్నారు. కాగా సావర్కర్‌పై రాహుల్‌ చేసిన గతంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. (నా పేరు రాహుల్‌ సావర్కర్‌ కాదు)
 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు