అవిశ్వాసంపై కొనసాగుతున్న ఉత్కంఠ

27 Mar, 2018 09:27 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై పార్లమెంటులో ఉత్కంఠ  కొనసాగుతోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని పలు పార్టీలు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో గందరగోళం మధ్య లోక్‌సభ వరుసగా ఆరు రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెల్సిందే. మూడు రోజుల సెలవుల తర్వాత లోక్‌సభ నేడు సమావేశమవుతోంది.

లోక్ సభ స్పీకర్‌కు మొత్తం 7 అవిశ్వాస తీర్మానాలు అందాయి. టీడీపీ నుంచి తోట నరసింహం, కేశినేని నాని, వైఎస్సార్సీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లికార్జున ఖర్గే, సీపీఎం నుంచి పి.కరుణాకరన్, ఎండీ సలీం, ఆరెస్పీ నుంచి ప్రేమచంద్రన్ అవిశ్వాస నోటీసులు సమర్పించారు. 

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే సమయంలో ఆందోళన చేయకూడదని టీఆర్‌ఎస్‌ తాజాగా నిర్ణయం తీసుకుంది. మంగళవారం సభలో అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేయకపోతే స్పీకర్‌ అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించే అవకాశముంది.

మరిన్ని వార్తలు