సీఎం జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ

25 Oct, 2019 17:43 IST|Sakshi

తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమావేశమయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో శుక్రవారం సాయంత్రం వంశీ కలిశారు. దాదాపు 30 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా వల్లభనేని వంశీ మాట్లాడుతూ... సీఎం రిలీఫ్‌ ఫండ్‌, నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన విషయాలు ముఖ్యమంత్రితో చర్చించినట్లు పేర్కొన్నారు. ఈ భేటీలో వంశీతో పాటు మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు