ప్రజల గుండెల్లో టీఆర్‌ఎస్, కేసీఆర్‌!

5 Jun, 2019 09:21 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి దయాకర్‌రావు, పక్కన ఎమ్మెల్యే రమేష్‌

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజలకు చేరువైన టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌ నాయకత్వంపై మరోసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజలు తమ సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటించారని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కాంగ్రెస్, విపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా... ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగిందని, ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారనడానికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో మరోసారి రుజువైందని తెలిపారు. హన్మకొండలోని తన నివాసంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. పరిషత్‌ ఎన్నికల పలితాల్లో కారు స్పీడును ఏ పార్టీ అందుకోలేకపోయిందని.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వచ్చిన ఈ ఫలితాలు చరిత్రలో రికార్డుగా నమోదు కానున్నాయని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్‌ పాలనపై నమ్మకంతో రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వెంటే ఉన్నారని అన్నారు. వరుస విజయాలను అందిస్తున్న రాష్ట్ర ప్రజలు, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఓటర్లు, ఈ విజయ పరంపరలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికీ మంత్రి కతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నూతనంగా ఏర్పడిన ఆరు జిల్లాల్లో మొత్తం 70 జెడ్పీటీసీ స్థానాలకు గాను 62 టీఆర్‌ఎస్‌ గెలువడం సామాన్యమైన విషయం కాదన్నారు. ఆరు జిల్లాల్లోని 70 మండలాల్లో 781 ఎంపీటీసీలకు గాను 541 ఎంపీటీసీలను టిఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా.. మరో 50 మందికి పైగా టీఆర్‌ఎస్‌ అభిమానులే గెలిచారని వెల్లడించారు.

తద్వారా ఆరు జిల్లా పరిషత్‌లతో పాటు 60కి పైగా మండల పరిషత్‌లపై గులాబీ జెండా ఎగురవేయబోతున్నామని మంత్రి దయాకర్‌రావు పేర్కొన్నారు. ప్రజలు అందించిన ఈ విజయాలతో తమ బాధ్యత ఇంకా పెరిగిందని, రాష్ట్రాన్ని అభివృద్ది చేయడమే లక్ష్యంగా ఆ పనిలో నిమగ్నమవుతామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇటీవల కొన్ని సీట్లు రావడంతో సంబర పడుతున్నాయని.. జాతీయ పార్టీల వల్ల కొంత అయోమయం నెలకొన్నా పరిషత్‌ ఎన్నికల్లో ఆ పార్టీలు కనుమరుగయ్యాయని అన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఘన విజయంతో గులాబీ శ్రేణులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలసి మిఠాయిలు పంచి, టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి.. జెడ్పీటీసీ, ఎంపీటీసీలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్, సాంబారి సమ్మారావు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కాపులను దశలవారీగా మోసం చేశారు’

దానికి కట్టుబడివున్నాం: పురందేశ్వరి

టీడీపీ నేతలకు అంబటి చురకలు..!

చంద్రబాబుపై ఎమ్మెల్యే రోజా ఫైర్‌

పున:పరిశీలనంటే బాబు ఎందుకు వణికిపోతున్నారు?

కేంద్ర మంత్రులపై మోదీ ఆగ్రహం

ప్రజలకు అది పెద్ద సమస్య.. దృష్టి పెట్టండి : మోదీ

గందరగోళం సృష్టించేందుకు టీడీపీ యత్నం

‘పార్టీని వీడుతున్నట్టు వార్తలు అవాస్తవం’

విశాఖలో టీడీపీ పంచాయితీ

‘ఆయనేం దేవుడు కాదు; రూల్స్‌ చదువుకుంటే మంచిది’

కథ బెంగళూరు చుట్టూనే..

అంచనాలు పెంచి దోపిడీ చేశారు

18న బలపరీక్ష

కాకి లెక్కలతో వృద్ధి పెరిగిందా?

చంద్రబాబు విదేశీ టూర్ల ఖర్చుపై సమగ్ర విచారణ

భవనాల కూల్చివేతపై ‘సుప్రీం’కు వెళ్తాం

ప్రశాంత్‌ కిషోర్‌ చేతిలో ఠాక్రే వారసుడు

ఎన్‌ఐఏ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే

ముందు వినడం నేర్చుకోండి ఒవైసీ : షా క్లాస్‌

బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే రోజా

క్లైమాక్స్‌కు చేరిన కర్ణాటకం

టీడీపీ జెండా కట్టి, పచ్చ చొక్కా వేస్తేనే...

కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కృష్ణసాగర్‌ రావు

‘ఇంతవరకు రూ. 2 వేల పింఛను ఇవ్వలేదు’

ఆ ధోరణి ప్రమాదకరం : మాయావతి

కర్నాటకం: నేడే అవిశ్వాసానికి అనుమతించండి

గులాబీ ఫామ్‌లు ఎవరికిస్తారో!

‘2 వేల కంటే 15 వేలు తక్కువా చంద్రబాబు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

అదే నా ప్లస్‌ పాయింట్‌