షార్ట్‌కట్‌ మినిష్టర్‌.. హైదరాబాద్‌ మన రాజధాని కాదా? 

11 Mar, 2019 11:37 IST|Sakshi

హే లోకేష్‌.. మీడియా ముందుకెప్పుడు వస్తావ్‌?

సోషల్‌ మీడియాలో నెటిజన్ల సూటి ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల సమర శంఖారావం మోగడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. రాజకీయ పార్టీలన్నీ అభ్యర్థుల ఖారారు.. ప్రచార వ్యూహాలు రచించడంలో నిమగ్నమయ్యాయి. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ తొలి దశ.. ఎప్రిల్‌ 11నే జరగనుంది. అయితే ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ ప్రకటన నేపథ్యంలో సీఎం చంద్రబాబునాయుడు తనయుడు మంత్రి నారాలోకేశ్‌ బాబు చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైతే.. ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం హైదరాబాద్‌లో సమావేశమయ్యారని, అంధ్రప్రదేశ్‌కు ఎవరు కావాలో మీరే తేల్చుకోండని, ఏదో కొంపలు మునిగినట్లు ట్వీట్‌ చేశారు. ఇది నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. లోకేశ్‌ అజ్ఞానాన్ని తెలియజేస్తూ ఘాటుగా స్పందించారు.

‘అయ్యా.. షార్ట్‌ కట్‌ మినిష్టరూ.. హైదరాబాద్‌ మరో ఐదేళ్లపాటు మన రాజధానేనన్న విషయం మర్చిపోయావా?.. మీ అయ్య ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి.. అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు. మరీ నీవెందుకు ఇంకా అమరావతిలో శాశ్వత ఇల్లు కట్టుకోలేదు.. ప్రతిపక్షనేతనన్నా.. ఇప్పటికే శాశ్వత ఇల్లు, పార్టీ కార్యాలయం కట్టారు.. మీరు అన్ని తాత్కాలికంతోనే కదా పబ్బం గడుపుతున్నారు?’ అని ఘాటుగా కామెంట్‌ చేస్తున్నారు.

ఇంకొందరైతే.. ‘లోకేష్‌ నిన్ను అసలు పప్పూ ఎందుకంటారో ఇప్పుడే అర్థమైంది. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ భేటీ ఫొటోనూ.. తాజా మీటింగ్‌ది అంటావేంది?’ అని తీవ్రంగా మండిపడ్డారు.  అసలు ఐటీ గ్రిడ్స్‌ వ్యవహారంపై ఐటీ మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పకుండా ట్విటర్‌లో ఎన్ని రోజులు పబ్బం గడుపుతావో చెప్పు? దమ్ముంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడు’ అనే కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. ‘మాకు ఎవరు కావాలో మేం ఇప్పటికే డిసైడయ్యాం.. కానీ నువ్వు. మీ అయ్యా తట్టా బుట్టా సర్దడానికి సిద్దంగా ఉండండి’ అని ట్రోల్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు