‘చంద్రబాబు పోటీ చేసినా గెలిచేది కొడాలి నాని’

2 Apr, 2019 18:30 IST|Sakshi

సాక్షి, గుడివాడ: ‘పార్లమెంట్‌ చూడాలంటే ఢిల్లీకి వెళ్లాలి. తాజ్‌మహల్‌ చూడాలంటే ఆగ్రా వెళ్లాలి. చార్మినార్‌ చూడాలంటే హైదరాబాద్‌ పోవాలి. కానీ అమరావతి చూడాలంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తిరగేస్తే అందులో ఊహా చిత్రాలు కనిపిస్తాయి. చంద్రబాబు చెప్పే అభివృద్ధి ఇలా ఉంటుంద’ ని వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. అమరావతిని సింగపూర్‌ చేస్తానని చెబుతున్న చంద్రబాబు ఐదేళ్ల పాలనలో దుర్గగుడి ఫ్లై ఓవర్‌ను పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు అనేకసార్లు మాట మార్చారని, ఊసరవెల్లి కూడా ఇన్ని రంగులు మార్చదని విమర్శించారు.

విశ్వసనీయత, వెన్నుపోటు మధ్య జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయతకు పట్టం కట్టబోతున్నారని బాలశౌరి అన్నారు. జనాన్ని నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పొత్తులు లేకుండా గెలిచిన చరిత్ర చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్‌ జగన్‌ ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సింగిల్‌ వస్తున్నారని చెప్పారు. గుడివాడలో చంద్రబాబు పోటీ చేసినా గెలిచేది కొడాలి నాని, ఎగిరేది వైఎస్సార్‌సీపీ జెండా అని పేర్కొన్నారు. గుడివాడ నియోజక వర్గానికి పర్మినెంట్‌ ఎమ్మెల్యే కొడాలి నాని అని వ్యాఖ్యానించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. (చదవండి: ‘చంద్రబాబు మైండ్‌ పనిచేయడం లేదు’)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు