తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా?

16 May, 2020 18:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఏపీ ప్రతిపక్ష నాయకుడు, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేయడంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తుప్పు, పప్పు హైదరాబాద్ పారిపోయి ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ అవసరమా అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. చదవండి: జాగ్రత్తలు పాటిస్తూ తిరిగి కార్యకలాపాలు: సీఎం జగన్

'అప్పట్లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరిస్తే జీతాలెలా తీసుకుంటారని ఎద్దేవా చేశారు. తుప్పు, పప్పు రెండు నెలలుగా పొరుగు రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వ సదుపాయాలెలా ఉపయోగించుకుంటున్నారో చెప్పాలి. ఇంట్లో దాక్కున్నా 150 మంది సెక్యూరిటీ సిబ్బంది అవసరమా?' అంటూ మండిపడ్డారు.

కాగా మరో ట్వీట్‌లో 'ప్రజల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వసతులు కల్పించడంలో దేశంలోనే రాష్ట్రం ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. రూ.16 వేల కోట్లతో పదివేల వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల ఏర్పాటుకు సీఎం జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రజల ముంగిటకు వైద్య సదుపాయలు తీసుకెళ్లే అసాధారణ కార్యక్రమం ఇది' అంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కరోనా కల్లోలం: ఇద్దరు ఏఎస్‌ఐలు మృతి 

మరిన్ని వార్తలు