తుఫాను దిశను తెలుసుకోవాలంటే బాబును సంప్రదించండి

27 Apr, 2019 11:20 IST|Sakshi

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : వాతావరణ శాస్త్రవేత్తలు ఫణి తుఫాను దిశను తెలుసుకోవాలంటే శాటిలైట్లతో నేరుగా సంభాషించే చంద్రబాబు నాయుడు సలహా తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా చంద్రబాబు, ఏసీబీ కొత్త డీజీ ఏబీ వెంకటేశ్వరరావుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు.

‘వాతావరణ సైంటిస్టులు ఫణి తుఫాను దిశను తెలుసుకోవాలంటే శాటిలైట్లతో నేరుగా సంభాషించే చంద్రబాబు సలహా తీసుకోవాలి. ఈయన యాంటెన్నాలు రాడార్ల కంటే బలమైన సిగ్నల్స్ తో పనిచేస్తాయి. తిత్లీ తుపాను సమయంలో ఐఎండి వాళ్లకు తనే తీరం దాటే ప్రదేశాన్ని యాక్యురేట్ గా చెప్పినట్టు డప్పు కొట్టుకున్నాడు’ అని ఎద్దేవా చేశారు.

విచారణ ఎదుర్కొంటారా? లేక చేస్తారా?
‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనిపించింది. చంద్రబాబు కోసం ఫోన్‌ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన... తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతిమీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా?’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు