దాసన్నకు పెద్దపీట

9 Jun, 2019 11:40 IST|Sakshi
మంత్రిగా ప్రమాణం చేస్తున్న కృష్ణదాస్‌

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: గార మండలాన్ని పోలాకి మండలాన్ని కలుపుతూ వంశధారపై నిర్మించతలపెట్టిన భారీ వంతెన నిర్మాణం గురించి గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ధర్మా న ప్రసాదరావు ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా ఉన్నప్పుడు రూ.72 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ఇంకా కొలిక్కిరాలేదు!

ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవనం నిర్మాణ పనులకు టీడీపీ ప్రభుత్వం అంచనాలు తగ్గించినా సకాలంలో పూర్తి చేయించలేకపోయింది. రూ.116 కోట్ల నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి!
శ్రీకాకుళం నుంచి ఆమదాలవలస రైల్వేస్టేషన్‌ను కలుపు తూ నిత్యం రద్దీగా ఉండే సీఎస్‌పీ రోడ్డును రూ.33 కోట్లతో విస్తరించడానికి గతంలో కె.ధనంజయ్‌రెడ్డి జిల్లా కలెక్టరుగా ఉన్నప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేసినా టీడీపీ ప్రభుత్వంలో జిల్లా నాయకులు ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపన చేసి వదిలేశారు!

ఇలా దీర్ఘకాలంగా ముందుకు కదలని పెండింగ్‌ ప్రాజెక్టులు జిల్లాలో పదుల సంఖ్యలో ఉన్నాయి. ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనమవుతున్నాయి. శనివారం ఆయన ఏర్పాటు చేసుకున్న మంత్రివర్గంలో జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌కు చోటు దక్కింది. అత్యంత ప్రాధాన్యం గల రోడ్లు–భవనాల మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా నత్తనడకనే సాగుతున్న, పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణానికి కృష్ణదాస్‌ హయాంలో మహర్దశ పడుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా, ధర్మాన కృష్ణదాస్‌ ఆర్‌ అండ్‌ బీ మంత్రిగా జిల్లాలో పలు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేయించడమే గాక, కొత్త ప్రాజెక్టులనూ సాకారం చేస్తారని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.  

సముచిత గుర్తింపు: జిల్లాలో తొలుత తనతో కలిసివచ్చిన కృష్ణదాసుకు జగన్‌ సముచిత గౌరవం కల్పించారు. ఆయన త్యాగాలకు గుర్తింపుగా మంత్రి పదవిని ఇచ్చారు.  జగన్‌ కాంగ్రెస్‌ పార్టీని వీడి వైఎస్సార్‌సీపీని ఏర్పాటు చేసినప్పుడు కృష్ణదాస్‌ ఆయన బాటలో నడిచారు. తన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు.  సీఎం విజన్‌కు తగ్గట్టు రోడ్ల అభివృద్ధి

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు తగ్గట్టు జిల్లాలోని రోడ్లను అభివృద్ధి చేస్తానని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చెప్పారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రజలతో సంబంధం ఉన్న రోడ్లు, భవనాల శాఖను అప్పగించడం ఆనందంగా ఉందని, ప్రాధాన్యతలు, నిధుల సమీకరణను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పెండిం గ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సామాజిక సమ తూకంతో మంత్రివర్గం కూర్పు చరిత్రలో నిలుస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు