మరోసారి ఓటేస్తే సర్వం దోచేస్తారు: వైఎస్‌ జగన్‌

31 Mar, 2019 17:54 IST|Sakshi

మరోసారి చంద్రబాబుని నమ్మెదు.. ఐదేళ్లు దోచుకున్నారు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం

జూ.న్యాయవాదులకు తొలిమూడేళ్లు.. నెలకు ఐదువేలు

అంగన్‌వాడి, ఆశా వర్కర్లు, హోంగార్డు జీతాలను పెంచుతాం

సాక్షి, ప్రకాశం: మరోసారి చంద్రబాబు నాయుడికి ఓటువేస్తే సర్వం దోచేస్తారని వైఎస్సార్‌ కాంగ్సెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఐదేళ్ల పాలనలో ఆయన చేసిన అధివృద్ధి శూన్యమని, ఏం చేశారని మరోసారి ఓటువేయ్యాలని ప్రశ్నించారు. చంద్రబాబు మరోసారి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉండవని, పంటలకు గిట్టుబాటు ధర ఉండదని, మహిళలకు డ్వాక్రా రుణాలు ఉండవని వైఎస్‌ జగన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 1994లో మద్యపాన నిషేధం హామీతో ఎన్టీఆర్‌ టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చారని.. 1995లో ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచి మద్యపాన నిషేధం, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలను ఎత్తివేశారని గుర్తుచేశారు. ఇప్పటికే గ్రామాల్లో జన్మభూమి కమిటీలతో అరాచకాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. 

ఈ సందర్భంగా వైస్‌ జగన్‌ మాట్లాడుతూ... దర్శి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాల్‌, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ‍్క్షప్తి చేశారు. తన సుధీర్ఘ పాదయాత్రలో అనేక మంది బాధలను విన్నానని, వారందరికీ తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుని నమ్మతే నరరూప రాక్షసున్ని నమ్మినట్టే. అన్ని వర్గాల ప్రజలను ఆయన మోసం చేశారు. ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీలేదు. దివంగత వైఎస్సార్‌ హయాంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనులు వేగంగా సాగాయి. ఇప్పటికీ ఆ ప్రాజెక్టు పనులను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరను కల్పించలేదు. మరోసారి టీడీపీకి ఓటువేస్తే.. హత్యలు తప్ప ఏమీ ఉండవు. కేసులు కూడా పెట్టనివ్వరు. సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వరు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో మోసం, అన్యాయం, అవినీతి, అధర్మం తప్ప మరేమీలేదు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం..
ప్రభుత్వం పాఠశాలను కూడా పూర్తిగా మూసి వేసి ప్రతి గ్రామంలో నారాయణ స్కూల్స్‌ను ప్రారంభిస్తారు. పాదయాత్రలో చాలామంది నన్ను కలిసి వారి బాధలను నాతో పంచుకున్నారు. వారికిచ్చిన హామీ మేరకు అన్ని నెరవేరుస్తా. కాంట్రాక్టు ఉద్యోగాలను పర్మినెంట్‌ చేస్తా. వారికి సరైన జీతాలు కల్పిస్తాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. కార్మికులను ఆదుకుంటాం. పాదయాత్రలో జూనియర్‌ న్యాయవాదులు నన్ను కలిసి వారి బాధలను పంచుకున్నారు. మొదటి మూడేళ్ల వరకు నెలకు ఐదువేలు భృతిగా ఇస్తాం. సంఘమిత్రలకు జీతాలు పెంచుతాం. అంగన్‌వాడీ, ఆశ, హోంగార్డుల జీతాలను పెంచుతాం. డ్వాక్రా రుణాలను మాఫీ చేసి.. సున్నా వడ్డీకే రుణాలు ఇస్తాం. రైతులకు గిట్టుబాట ధర కల్పించి ఆదుకుంటాం. 

సున్నా వడ్డీకే రుణాలు
మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ సమస్యకు ఒక మంచి పరిష్కారం లభిస్తుంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చంద్రబాబు చేయని మోసం, చెప్పని అబద్దం ఉండదు. ప్రతి ఊరికి మూటలు, మూటలు డబ్బులు తీసుకోస్తారు. ప్రతి ఒక్కరి చేతిలో మూడు వేల రూపాయల నగదును పెడతారు. ఆ మోసాలకు మీరు మోసపోవద్దు.  చంద్రబాబు ఇచ్చే మూడు వేల రూపాయలకు మోసపోకండని ప్రతి ఒక్కరికి చెప్పండి. మన పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏటా రూ.15 వేల రూపాయలు ఇస్తాం. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ వంటి పెద్దపెద్ద చదువులు ఉచితంగా చదివిస్తాం. ఎన్ని లక్షలైనా కూడా భరిస్తాం. గతంలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి. ఇప్పుడు అది కనిపించని పరిస్థితి. ఎన్నికల తేదీ వరకు ఎంతైతే అప్పు ఉంటుందో ఆ మొత్తాన్ని నాలుగు దఫాలుగా మీ చేతికే అందిస్తాం. అంతేకాకుండా మళ్లీ బ్యాంకుల వద్ద నుంచి సున్నా వడ్డీకే రుణాలు వస్తాయి. రాజన్న రాజ్యం మళ్లీ తీసుకువస్తాం. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్సార్‌​ చేయూత కింద 75 వేల రూపాయలు నాలు దఫాలుగా చెల్లిస్తాం. పసుపు కంకుమ డ్రామాకు మోసపోవద్దు. చంద్రబాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోలేదు. ప్రతి రైతన్నకు మే నెలలోనే 12,500 రూపాయలు ఇస్తాం. నవరత్నాల ద్వారా ప్రతి ఒక్కిరికి మేలు జరుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు