253వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్‌

2 Sep, 2018 17:53 IST|Sakshi

సాక్షి, మడుగుల : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 253వ రోజు షెడ్యూలు ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. సోమవారం ఉదయం జననేత మడుగుల నియోజకవర్గంలోని నైట్‌ క్యాంప్‌ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కొత్తపెంట, ఎ. భీమవరం, పడుగు పాలెం మీదుగా ఎ. కోడూరు వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది.

అక్కడ వైఎస్‌ జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో పాదయాత్ర పునః ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పాదయాత్ర కె.కోటపాడు మండలంలోని కె. కోటపాడు మీదుగా జోగన్న పాలెం వరకు జననేత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. 

ముగిసిన పాదయాత్ర : వైఎస్‌ జగన్‌ 252వ రోజు పాదయాత్ర ఆదివారం ములకలాపల్లి వద్ద ముగిసింది. నేడు రేవెళ్ల నుంచి ప్రారంభమైన జననేత పాదయాత్ర ఖండేపల్లి క్రాస్‌, లక్కవరం క్రాస్‌, గవరవరం, జి. జగన్నాథపురం మీదుగా మడుగుల నియోజకవర్గంలోని వేచలం క్రాస్‌, ములకలాపల్లి వరకు 11.8 కిలోమీటర్లు సాగింది. ఇప్పటివరకు వైఎస్‌ జగన్‌ 2,871.4 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు