ప్రజాసంకల్పయాత్ర 81వ రోజు షెడ్యూల్‌

5 Feb, 2018 20:08 IST|Sakshi

సాక్షి, నెల్లూరు : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 81వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర  షెడ్యూల్‌ను విడుదల చేశారు. మంగళవారం ఉదయం ఆయన ఆత్మకూర్‌ నియోజకవర్గం సంగం మండలం అన్నారెడ్డి పాలెం క్రాస్‌ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి దువ్వూరు, సిద్ధిపురం, వెంగారెడ్డి పాలెం క్రాస్‌రోడ్డు, గాంధీ జన సంఘం మీదుగా పల్లెపాలెం క్రాస్‌రోడ్డు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు.

మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. పల్లెపాలం మీదుగా సంగం శివారు చేరుకుంటారు. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

ముగిసిన 80వ రోజు పాదయాత్ర
వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 80వ రోజు ప్రజాసంకల్పయాత్రను అన్నారెడ్డి పాలెం క్రాస్‌ రోడ్డు వద్ద ముగించారు. సోమవారం ఉదయం దేవరపాలెం శివారు వద్ద ప్రారంభమైన జననేత పాదయాత్రకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలి వచ్చి సంఘీభావం తెలిపారు. ఇవాళ  వైఎస్‌ జగన్ ‌13.5 కిలోమీటర్లు నడిచారు. 

>
మరిన్ని వార్తలు