ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? : సీఎం జగన్‌

13 Dec, 2019 10:29 IST|Sakshi

చంద్రబాబు ప్రవేశించాల్సిన గేటు అది కాదు

ప్రోటోకాల్‌ ప్రకారమే సభ్యులను లోనికి పంపేందుకు మార్షల్స్‌ యత్నించారు

ఉద్యోగస్తులను చంద్రబాబు బాస్టడ్‌ అని దూషించడం దారుణం

చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవహరించారనే దానికి ఈ ఘటన నిదర్శనం : సీఎం జగన్‌

సాక్షి, అమరావతి : అసెంబ్లీ ఆవరణలో మార్షల్స్‌పై టీడీపీ సభ్యులు దౌర్జన్యానికి దిగడాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తప్పుబట్టారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా ప్రవర్తించారన్నదానికి ఈ ఘటన నిదర్శమని తెలిపారు. ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా అని ప్రశ్నించారు. టీడీపీ సభ్యుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తాను సభలోకి ప్రవేశించాల్సిన గేటు అసలు అది కాదు. ఆయన గేటు నెంబర్‌ 2 నుంచి సభలోకి రావాల్సి ఉంది. కానీ అందరితో కలిసి ఆందోళన చేయాలని చంద్రబాబు చూశారు. ప్రోటోకాల్‌ ప్రకారం సభ్యులను మాత్రమే లోనికి పంపేందుకు మార్షల్స్‌  ప్రయత్నించడం. కానీ చంద్రబాబు నాయుడు మార్షల్స్‌ను బాస్టడ్‌ అని దూషించడం దారుణం. లోకేశ్‌ చీఫ్‌ మార్షల్స్‌ను యూజ్‌లెస్‌ అంటూ తిట్టారు. ఉద్యోగుస్తులను అనరాని మాటలు అన్నార’ని తెలిపారు.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి : బుగ్గన
టీడీపీ సభ్యులు అధికారులు గొంతు పట్టుకుని దౌర్జన్యానికి దిగారని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న అధికారులను పిలిచి మాట్లాడినట్టు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు సభలోని రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. సభ్యుల రక్షణ కోసమే మార్షల్స్‌ ఉన్నారని గుర్తుచేశారు. అలాంటిది మార్షల్స్‌ను టీడీపీ సభ్యులు దుర్భాషలాడారని సభ దృష్టికి మరోసారి తీసుకువచ్చారు. నిన్నటి ఘటనపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. 

రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి ఘటన జరగలేదని గుర్తుచేశారు. చీఫ్‌ మార్షల్స్‌ను ఇంత దారుణంగా తిడతారా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఇంత జరిగినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని అన్నారు. చంద్రబాబు తన మాటలను ఉపసంహరించుకోని.. క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు