‘వడ్డీలకే రూ. 20 వేల కోట్లు కట్టాల్సి వస్తోంది’

24 Jun, 2019 16:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలన్నీ అమలు చేయాలని లోక్‌సభలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రత్యేక హోదా అంశాన్ని ఎంపీ మిథున్‌రెడ్డి లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందని... రాష్ట్రం తీవ్ర ఆర్థికసంక్షోభం ఎదుర్కొంటోందని వివరించారు. వడ్డీలకే 20వేలకోట్లు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఉద్యోగుల జీతాలు చెల్లించాడానికే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితిని ఏపీ ఎదుర్కొంటుందన్నారు. రాష్ట్రంలో 77శాతం రైతులు అప్పుల్లో మునిగిపోయారని, వారిని ఆదుకునేందుకు కేంద్రం​ ఏం చేస్తుందో ముందే చెప్పాలని కోరారు. రైతుల అభివృధికోసం స్వామినాథన్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను అమలు చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు